astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లిపోతోంది.. సాయంత్రం పూజ చేయ‌వ‌చ్చా..?

వినాయ‌క చ‌వితి రోజున కొంత‌మందికి వ‌చ్చిన సందేహం ఇది. ఎందుకంటే ఇవాళ మ‌ధ్యాహ్న స‌మ‌యంలోనే చ‌వితి వెళ్లిపోతోంది. అటువంట‌ప్పుడు పూజ చేయాలా వ‌ద్దా అనే అనుమానం వెంటాడుతోంది.
వాస్త‌వానికి వినాయ‌క చ‌వితి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్త‌వానికి వేకువ జామునే నిద్ర లేచి రోజు చేసుకొనే నిత్య దేవ‌తారాధ‌న ముందు పూర్తి చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఇంటిల్లిపాది క‌లిసి పాల‌వెల్లి ని అలంక‌రించి, పూజా మందిరాన్ని అలంక‌రించుకొని పూజ‌కు సిద్ద ప‌డాలి. పూజ కోసం వినాయ‌క ప్ర‌తిమ‌ను తెచ్చి పెట్టుకోవ‌టం ఆన‌వాయితీ. ఆ త‌ర్వాత వినాయ‌కుడికి పూజ చేసి నైవేద్యాలు చెల్లించ‌టం ఆన‌వాయితీ. గ‌ణ‌ప‌తి పూజ‌లో ప‌విత్రంగా భావించే ప‌త్రి పూజ‌ను ఆచ‌రిస్తారు.

ఇంటి బ‌య‌ట ఉండే కూడ‌ళ్ల లో, సంస్థ ల్లో, కంపెనీల్లో వినాయ‌కుడ్ని నిలిపి పూజ‌లు చేయ‌టం ఆన‌వాయితీ. సాధార‌ణంగా ఎవ‌రికి వారు ఇళ్ల ద‌గ్గ‌ర పూజ‌లు చేసుకొని విధుల‌కు హాజ‌ర‌య్యాక‌, మ‌ధ్యాహ్న స‌మ‌యంలో లేదా సాయంత్రం స‌మ‌యంలో ఈ సామూహిక పూజ‌లు చేస్తారు. ఈ సారి మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లి పోతోంది కాబ‌ట్టి ఎలా అనే సందేహం వ్య‌క్తం అయింది. వాస్త‌వానికి ప్ర‌తీ రోజూ తిథి పూర్తిగా ఉండ‌టం జ‌ర‌గ‌క పోవ‌చ్చు. అటువంట‌ప్పుడు సూర్యోదయ స‌మ‌యంలో ఉన్న తిథినే ఆ రోజు తిథిగా భావిస్తారు. అందుచేత సూర్యోద‌య స‌మ‌యంలో ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఆ రోజుకి సంబంధించిన కార్య‌క‌లాపాలు నిర్ణ‌యించుకొంటారు. అందుచేత ఈ ప్రాతిప‌దిక‌నే ఇవాళ వినాయ‌క చ‌వితి పాటించ‌టం జ‌రుగుతోంది.అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజించి గ‌ణేశుడి ఆశీస్సులు అందుకోవ‌టం ఆన‌వాయితీ.

1 comment:

  1. వినాయక చతుర్థీ నిర్ణయానికి పంచమితో కూడిన చతుర్థినే లెఖ్ఖిస్తారు కాబట్టి నిన్నటి సాయంత్రం వినాయక వ్రతం చేయడం కరక్టే, అందునా వినాయక వ్రతం నక్త వ్రతం అంటే ఉదయంనుంచీ ఉపవాసం ఉండి ప్రదోష వేళలో చేయవలసిన వ్రతం. వ్రతచూడామణిలో అలానే చెప్పబడింది. అందులోనే వినాయక చవితీ నిర్ణయం గూర్చి కూడా చెప్పబడింది.

    ReplyDelete