astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

రేపటి విశిష్టత మీకు తెలిసే ఉంటుంది..!

రోజుల విశిష్టత, ప్రాధాన్యం తెలుసుకొంటే భ‌లే ఆస‌క్తిగా ఉంటుంది. ముఖ్యంగా అంత‌కు ముందు తెలిసిన విష‌యాలే అయినా ఆయా రోజుల‌కు ప్రాధాన్యం ఉంటే బ‌హు చ‌క్కగా ఉంటుంది. అదే విష‌యాన్ని గుర్తుకు తెచ్చుకోవ‌టంతో పాటు ఆచ‌ర‌ణ‌లో పెట్టుకొనేందుకు వీలవుతుంది.

రేపు సోమ‌వారం అన‌గా ఫిబ్రవ‌రి 25వ తేదీన మాఘ పౌర్ణమి ఏర్పడుతోంది. కార్తీక మాసం త‌ర్వాత అంత‌టి విశిష్టత ఉన్న మాసంగా మాఘ మాసాన్ని చెబుతారు. అందుకే కార్తీక పౌర్ణమి త‌ర్వాత అంత‌టి ప్రాధాన్యం ఉన్న రోజుగా మాఘ పౌర్ణమిని వ‌ర్ణించ‌వచ్చు. మాఘ మాసంలో స్నానం, దానం ప్రత్యేకంగా చెప్పద‌గిన‌వి. అందుకే మాఘ‌పౌర్ణమి రోజున కూడా ప‌విత్ర స్నానాలు ఆచ‌రిస్తారు. ఆ రోజున వేకువ జామునే పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పైగా సోమ‌వారం కూడా క‌లిసి రావ‌టంతో ప‌ర‌మేశ్వరునికి అర్చన‌లు, అభిషేకాలు చేయిస్తారు. ఉన్నంత‌లో కొంత మొత్తాన్ని దానంగా చేయ‌టం మంచిద‌ని చెబుతారు.
ఈ సారి మ‌హా కుంభ మేళా జ‌రుగుతుండ‌టంతో అల‌హాబాద్ (ప్రయాగ‌) లో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు చేయ‌బోతున్నారు. గంగ, య‌మున‌, స‌రస్వతీ న‌దుల స‌మ్మేళ‌నంలో పుణ్య స్నానం చేయ‌టం పవిత్రంగా భావిస్తారు. దాదాపుగా 80 ల‌క్షల మంది భ‌క్తులు రేప‌టి రోజుల స్నానాలు ఆచ‌రిస్తార‌ని అంచ‌నా వేస్తారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ సంఖ్య కాస్త త‌గ్గ వ‌చ్చని భావిస్తున్నారు. పుష్య మాస‌పు పౌర్ణమి నుంచి మాస‌పు వ్రతం ఆచరిస్తున్న వారు ఈ మాఘ పౌర్ణమితో దీక్షను విర‌మిస్తారు. 

1 comment:

  1. శర్మగారూ,
    నమస్కారం. మాఘపౌర్ణమి ప్రాధాన్యాన్ని చక్కగా వివరించారు. నాకు ఒక సమాచారం ఇవ్వగలరని ఆశిస్తున్నాను. మార్చి 15 న పుత్రగణపతి వ్రతం అని చూసాను. అది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఒకవేళ దంపతులు విదేశాల్లో ఉంటే ఇండియాలో వారి పేరున అది చెయ్యడానికి వీలుంటుందా..దయచేసి నా సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలతో...
    శ్రీలలిత..

    ReplyDelete