astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

ఫిబ్రవ‌రి 14 వేలంటైన్స్ డే మాత్రమే కాదు.. ఇంకో ప్రత్యేక‌త కూడా ఉంది..!

ఫిబ్రవ‌రి 14 అంటే చాలామందికి వేలంటైన్స్ డే గుర్తుకొని వ‌స్తుంది. దీన్ని ప్రేమికుల రోజుగా ఈ కాల‌పు యూత్ గుర్తుంచుకొంటారు. ఈ సంవ‌త్సరం ఫిబ్రవ‌రి 14 కు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే మాఘ శుద్ధ పంచ‌మి అంటే వ‌సంత పంచ‌మి అని అర్థం. చ‌దువుల తల్లి స‌రస్వతి దేవి కి ఎంతో ప్రీతిక‌ర‌మైన రోజు. అందుకే వ‌సంత పంచ‌మి రోజున అమ్మవారిని అర్చించుకోవ‌టం ఉత్తమం.

భార‌తీయ సంప్రదాయంలో స‌రస్వతీ దేవికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ వాణీ గిరిజాశ్చర‌యా... అంటూ అమ్మల గ‌న్న అమ్మ వారిని త‌ల‌చుకొని వాజ్మయం మొద‌లైంది. అంటే సాహిత్యం మొద‌లైన‌దే అమ్మ వారి ప్రస్తావ‌న‌తో అంటారు. అందుకే ఏదైనా కార్యక్రమం మొద‌లు పెడితే శ్రీ‌కారం చుట్టార‌ని చెబుతారు. ఎందుకంటే సాహిత్య సృష్టి అన్నది శ్రీ కారంతో మొద‌లైంది కాబ‌ట్టి శ్రీ‌కారం చుట్టడం అన్న నానుడి ప్రారంభం అయింది. ఈ విష‌యం ప‌క్కన పెడితే .. స‌ర‌స్వతి దేవిని కొలిచాకే విద్యను అభ్యసించ‌టం ఆన‌వాయితీ. అందుకే చ‌దువుకొంటున్న వారంతా ఈ వ‌సంత పంచ‌మి రోజున క‌చ్చితంగా స‌ర‌స్వతీ పూజ చేసుకోవాలి. క‌నీసం స‌ర‌స్వతీ స్తోత్రాన్ని ప‌ఠించాలి. వ‌సంత పంచ‌మి రోజున భ‌క్తి తో పుస్తకాలు అమ్మవారి స‌మ‌క్షంలో ఉంచి పూజించ‌ట ఆన‌వాయితీ.
స‌ర‌స్వతీ న‌మ‌స్తుభ్యం వ‌ర‌దే కామ‌రూపిణీ
విద్యారంభం క‌రిష్యామి సిద్దిర్భవ‌తు మే స‌దా..!
ప‌ద్మ ప‌త్ర విశాలాక్షీ ప‌ద్మ కేస‌ర వ‌ర్థిని
నిత్యాం ప‌ద్మాల‌యాం దేవీం సామాంపాతు స‌ర‌స్వతీ..!
అంతే గాకుండా అమ్మవారి ఆరాధ‌న‌కు వ‌సంత పంచమి మంచి రోజు.  ఆ రోజున మాఘ శుద్ద పంచ‌మి రోజున అమ్మ వారి ని శ్రీ సూక్త స‌హితంగా అర్చిస్తే మేలు. వేకువ జామున లేచి త‌ల స్నానం చేసి పువ్వులు, కుంకుమ‌తో అమ్మ వారి ఆరాధ‌న చేసుకోవాలి. పాయసం వండి నైవేద్యం చెల్లించ‌వ‌చ్చు. ఉద‌యం పూట కాలేజీల‌కు, ఆఫీసుల‌కు ప‌రిగెత్తినా క‌నీసం సాయంత్రం అయినా శ్రేష్టంగా పూజ చేసుకోవ‌చ్చు. పూజ‌కు భ‌క్తి ముఖ్యం క‌దా..!

2 comments:

  1. నీహారహార ఘనసార సుధాకరాభామ్ కళ్యాణదాం కనక చంపక దామభూషామ్ ।
    ఉత్తుంగ పీన కుచకుంభ మనోహరాఙ్గీం వాణీం నమామి మనసా వచసాం విభూత్యై ॥

    ఈ యేడాది శ్రీ పంచమి ఫిబ్రవరి 15 న వచ్చిందని అనుకున్నాను, 14 నా?

    ReplyDelete
  2. సూర్యోద‌య స‌మ‌యంలో ఏ తిథి ఉంటుందో దాన్నే ఆ రోజుకి ప్రామాణికంగా తీసుకొంటారు. అందుచేత 14వ తేదీ ఉద‌యం 8గం. దాకా చ‌వితి ఉంది కాబ‌ట్టి మ‌ర్నాడు 15వ తేదీన శ్రీ పంచ‌మి పాటించ‌టం క‌రెక్ట్. అయితే సాయంత్రం పూట అమ్మవారి పూజ‌కు శ్రేష్టం కాబ‌ట్టి 14వ తేదీ సాయం సంధ్య వేళ లో పూజించ‌టం మేలు. అందుచేత 14వ తేదీ ఇత‌ర పనులు పెట్టుకొనే కంటే అమ్మ వారిని అర్చించ‌టం మేలు అని చెప్పట‌మే ఉద్దేశం. శుభ‌మ‌స్తు

    ReplyDelete