astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

సడెన్ గా వ‌ర్షం ఎందుకు ప‌డిన‌ట్లు..!

ఫిబ్రవ‌రి నెల‌లో ఒక్క సారిగా వాన‌లు కురిశాయి. అకాల వ‌ర్షాల‌కు అనేక చోట్ల పంట‌లు దెబ్బతిన్నాయి. 52 వేల ఎక‌రాల్లో పంట నీట మునిగింది. ఇంత‌కీ ఫిబ్రవ‌రిలో వాన‌లు ఎందుకు ప‌డుతున్నాయి అనే అనుమానం కలుగ వ‌చ్చు.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టద‌న్నది న‌మ్మకం. వాన‌లు ప‌డటాన్ని కూడా ఇదే కోణం లో అర్థం చేసుకోవ‌చ్చు. నంద‌న నామ సంవ‌త్సరానికి రాజు గా శుక్రుడు ఉన్నాడు. ధాన్యాధిప‌తి శ‌ని, అర్ఘాధిప‌తి గురుడు, మేఘాధిప‌తి గురువు, ర‌సాధిప‌తి గురువు, నీర‌సాధిప‌తి కుజుడు గా ఉన్నారు. ఆవ‌ర్తక నామ మేఘ‌మున గాని మంచి ధాన్యం, గోధుమ‌లు, జొన్నలు, సెన‌గ‌లు, ప‌త్తి, నూనె గింజ‌లు మొద‌లగు వాని ఉత్పత్తికి హాని క‌లుగుతుంద‌ని జ్యోతిషులు ఈ ఏడాది ప్రారంభంలోనే అంచ‌నా వేశారు. ఈ ఏడాది వ‌ర్ష కుండ‌లి రీత్యా తులా లగ్నం అయింది. వ‌ర్ష ప్రమాణం స‌ముద్ర మందు ఏడుభాగ‌ములు, ప‌ర్వత‌ములందు తొమ్మిది భాగ‌ములు, భూమిపై నాలుగు ప్రమాణ‌ములు ఉండును. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వ‌ర్షము ఉంటుంద‌ని ముందుగానే విశ్లేషించ‌డ‌మైన‌ది. ఇందులో భాగంగానే ఆక‌స్మికంగా వాన‌లు పోటెత్తాయి. తెలంగాణ‌, రాయ‌ల‌సీమ జిల్లాల్లో మ‌రిన్ని వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అర్థం అవుతోంది. మొక్క జొన్న, పొద్దు తిరుగుడు, జొన్న, వేరుశ‌న‌గ‌, శ‌న‌గ‌, మిర‌ప‌, అర‌టి, నువ్వుల పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ఈ అకాల వ‌ర్షాలు శాంతించి రైత‌న్నకు ఊర‌ట క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుడ్ని ప్రార్థిద్దాం..!

3 comments:

  1. వర్షం పడితే ఎందుకు పడింది అంటారు!
    పడ లేదంటే ఎందుకు పడలేదో అంటారు !
    అబ్బబ్బా, అన్నిటికి సమాధానాలు ఉన్నాయండి మరి!


    జిలేబి.

    ReplyDelete
  2. అయ్యా!

    ఇదే మాట శాస్త్రవేత్తలమాట అయితే మీరు ఈ వెటకారం ఉపయోగించరు కదా
    ముందుగానే శాస్త్రం సూచించిన విషయాన్ని గమనిమ్చకపోవటం మన నిర్లక్ష్యం . రైతులకు జరగబోయే నష్టాన్నిగూర్చి ఆలొచించాల్సిన్ అవసరం గానీ ఆదుకునే బాధ్యత ఉన్నదనే గమనిక గాని లేని ఈ నాయకవ్యవస్థమీద మీకు కోపంరాలేదు. రేపు రైతులు వ్యవసాయం కూడా మానివెస్తే ఒక్కముద్దకోసం కూడా ఏద్చి ఎర్రమన్ను పాలుగావాల్సివస్తుందన్న భయం కూదా లేదు. కేవలం వెటకారం... ఎవరికి మేలు చెప్పండి ? జిలేబీగారూ ! మీ రచనాశైలిని అభిమానించే వారిలో నేనూ ఒకణ్ణి. కానీ ఈవెటకారాన్ని అంగీకరించలేను.

    ReplyDelete
  3. దుర్గేశ్వర గారు చెప్పిన‌ది అక్షర స‌త్యం. ఒక శాస్త్రంలో ఉన్న విష‌యాన్ని గుర్తించ‌టం, గౌర‌వించ‌టానికి ప్రయ‌త్నించ‌టం మేలు.

    ReplyDelete