astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

ఆదివారం నాడు ఈ ప‌ని చేసి చూడండి..!

ఆదివారం అంటేనే ఒక ఆట‌విడుపు. చిన్న‌ప్పుడు స్కూల్ కు వెళ్లేట‌ప్పటి నుంచి కాలేజీ రోజులు, క్యాంప‌స్ క‌బుర్ల‌ను దాటి ఉద్యోగ జీవితాల్లో స్థిర‌ప‌డే దాకా ఇదే కొన‌సాగుతుంది. అందుకే సాధార‌ణంగా ఆదివారం న‌గ‌ర వాసుల్లో చాలా మంది ఉద‌యం పూట నిద్ర కూడా లేవ‌రు. అందుచేత ఆదివారం అంటేనే బ‌ద్ద‌కంగా మొద‌ల‌వుతుంది. కానీ ఇదే ఆదివారాన్ని స‌ద్వినియోగం చేసుకొనే మార్గం కూడా ఉంది..

వాస్త‌వానికి ప్ర‌తీ రోజు కొద్ది సేపు పూజా కార్య‌క్ర‌మాల్లో గ‌డ‌ప‌టం మంచిది. ఉద‌యం కానీ, సాయంత్రం కానీ శుచియై నిశ్చ‌ల‌మైన మ‌నస్సుతో ఆరాధన చేసుకోవాలి. ఇష్ట‌మైన సూక్తాల్ని ప‌ఠించ‌వ‌చ్చు. పారాయణ చేసుకోవ‌చ్చు. ఓం న‌మ శ్శివాయ లేదా శ్రీ సాయి నాథాయ న‌మః వంటి మంత్రాన్ని ఇష్ట మైన‌న్ని సార్లు జ‌పించుకోవ‌చ్చు. లేదంటే ధ్యానం చేసుకోవ‌చ్చు. ఉద‌య‌మే కొద్ది సేపు ఈ ప‌నిచేసి చూడండి. ఆ రోజంతా ఎంతో బాగుంటుంది. వాస్త‌వానికి దైవం వెంట ఉంటే అన్నీ స‌వ్యంగా సాగుతాయి. దైవ బ‌లం గొప్ప‌త‌నమే అది.
ఇక ఆదివారం విష‌యానికి వ‌ద్దాం. ప్ర‌తీ రోజు ఉద‌యం పూట దైవారాధ‌న‌కు స‌మ‌యం వెచ్చించ‌లేని వాళ్లు కానీ, బ‌ద్ద‌కంతో ప‌నులు వాయిదా వేసే వారు కానీ ఆదివారాన్ని స‌ద్వినియోగం చేసుకొంటే మంచిది. చ‌క్కగా కొద్ది సేపు దేవ‌తారాధ‌న‌కు కాలాన్ని వెచ్చించండి. భ‌గ‌వంతునితో మ‌న మ‌నస్సుని జ‌త చేస్తే ఎన్నెన్నో జ్ఞాప‌కాల దొంత‌ర‌లు దొర్లిపోతాయి. దైవం అనుగ్రహాన్ని సంపాదించుకొనేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందుకు మ‌నస్సు పెడితే చాలు.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఆంగ్ల జ్ఞానం అంతగాలేని మా లాంటి వారి కోసమైనా సరే మీ గురించి తెలుగులో వ్రాయగలరు. మీరు బ్లాగు పేరును తెలుగులో ఉంచి, తెలుగులో వ్రాస్తూ కూడలికి అనుసంధిచారు కాబట్టి ఇలా సలహా చెప్పే సాహసం చేస్తున్నాను
    తరువాత మీరు వ్రాసే కవనంలో వత్తులు పొల్లులు ఒకసారి సరిచేయండి ఉదాహరణకు :వాస్త‌వానికి = వాస్తవానికి
    ప్ర‌తీ= ప్రతి
    కార్య‌క్ర‌మాల్లో = కార్యక్రమాలలో
    పదకూర్పులో ఇలాంటి తప్పులు తెలుగును కొత్తగా కంప్యూటర్లో వ్రాయటం మొదలుపెట్టినప్పుడు దొర్లుతూ ఉంటాయి. లేఖిని వాడి చూడండి
    lekhini.org

    మీ బ్లాగు పేరు చాలా బాగున్నది

    ReplyDelete
  3. శివ‌రామ ప్ర‌సాద్ గారు..!
    మీ సూచ‌న‌లు చాలా బాగున్నాయి. త‌ప్ప‌కుండా వీటిని అనుస‌రిస్తాం. ధ‌న్య‌వాదాలు.

    ReplyDelete