astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

జ్యోతిషం ఒక శాస్త్రమా.. ఒక న‌మ్మక‌మా.. ఒక వేదాంత‌మా..!

జ్యోతిషం మీద వివాదాలు కొత్తేమీ కాదు. దీనిపై ఉన్న విమ‌ర్శలు అన్నీ ఇన్నీ కావు. అస‌లు ఇదంతా ఒక వేస్ట్ అనుకొనే వారికి జ‌వాబు చెప్పటం కూడా వేస్ట్. ఎందుకంటే ఒక న‌మ్మకం బ‌లంగా మ‌న‌స్సులో పెట్టుకొని వాద‌న‌కు దిగుతుంటే ఆ వాద‌న ఎప్పటికీ తెగేది కాదు. అందుచేత జిజ్ఞాస ప‌రుల‌కు జ్యోతిషం అంటే ఏమిటో వివ‌రించ‌టం ఉత్తమం.
జ్యోతిషం అన్న ప‌దం సంస్కృత భాష లోది. జ్యోతి అంటే ఒక దీపం లేక వెలుగు అని అర్థం . అంటే స‌క‌ల మాన‌వాళికి, జీవ కోటికి జ్యోతి వంటి వెలుగులు ప్రసాదించే శాస్త్రం గా జ్యోతిషం ను భావించాల్సి ఉంటుంది. ఇది వేద‌ముల నుంచి ఉద్భవించిన అద్బుత శాస్త్రం. అందుకే ప్రాచీన భార‌తీయ జ్యోతిష శాస్త్ర వేత్తలు ఖండాంత‌రాల్ని దాటిన ఖ్యాతిని ఆర్జించారు.

జీవుల పుట్టుక‌, ఎదుగుద‌ల‌, వృత్తి ప‌ర‌మైన జీవితం, వ్యక్తిగ‌త జీవితం, మాన‌సిక ప‌రిప‌క్వత‌.. ఇలా ఒక‌టేమిటి జీవుడు పుట్టిన నాటి నుంచి గిట్టే వర‌కు ప్రతీ ద‌శ‌ను జ్యోతిషం ద్వారా విశ్లేషించుకోవ‌చ్చు. జ్యోతిషం సాయంతో మాన‌వ జీవితం ఫ‌లవంతం అవుతుంది. ప్రతీ ద‌శ‌లోని జ్ఞాన జ్యోతిలా ప్రకాశిస్తూ భ‌విష్యత్ ద‌ర్శనం చేస్తుంది.
జ్యోతిషం ద్వారా గ్రహ‌గ‌తుల్ని మార్చటం సాధ్యం కాదు సుమా. గ్రహాల ప్రభావం, ఫ‌లితాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. అందుకు అనుగుణంగా జీవ‌న గ‌మ‌నాన్ని స‌రిచేసుకొనే వీలు క‌లుగుతుంది. అంతిమంగా ధ‌ర్మ ప‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపేందుకు వీల‌వుతుంది. ఇదంతా జ్యోతిషం గురించి ప‌రిచ‌యం మాత్రమే సుమా..! జ్యోతిష శాస్త్రపు అద్భుత విశ్లేష‌ణ‌, వివ‌ర‌ణ త‌దుప‌రి పోస్టుల్లో చూడ‌వ‌చ్చు.

4 comments:

  1. చూడండి:
    http://jyotissastram.blogspot.in/
    (నా జ్యోతిశ్శాస్త్రం బ్లాగు)

    ReplyDelete
  2. జ్యోతిష్యాన్ని నమ్మి జీవితాన్ని పాడు చేసుకోవాలా ?
    కర్మ సిద్దాంతాన్ని నమ్మి జీవితం ఇంతే అనుకోవాలా ?

    కృషి చేసి కష్టే ఫలే అని అభివృద్ధి లోకి రావాలా ?
    జ్యోతిష్యం, భారద్దేశం అభివృద్ధి కి ఫైర్ వాల్ గా మారిందా ?


    జిలేబి.

    ReplyDelete
  3. జ్యొతిషాన్ని నమ్మినంతలో మనపని మనం చెయ్యడం మానకూడదు. అది అసలు రహస్యం.ఎప్పుడు కషపడితేనే ఫలితం. జ్యోతిషం ఒక సూచన, దిక్సూచి, ప్రమాద నివారిణి, మందు........

    ReplyDelete
  4. షడ్భాగంతు మనుష్యానామ్ ।
    సప్తమం దైవ చింతనమ్ ॥

    ReplyDelete